రోడ్ ఆక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తి ని కాపాడిన మంత్రి ఆళ్ల నాని

by సూర్య | Mon, Jan 17, 2022, 07:25 PM

ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని నేడు రోడ్ ఆక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తి ని కాపాడి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై రోడ్డు పక్కన పడి ఉన్న బాధితుడిని మంత్రి నాని రక్షించారు. విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్డు ప్రమాదంలో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి రోడ్డు పక్కన పడిపోయాడు. ఆ రూట్లో వెళ్తున్న మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు.
ఆళ్ల నాని వెంటనే కారు దిగి క్షతగాత్రుల వద్దకు చేరుకుని వివరాలు అడిగి అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి ఆళ్ల నాని తన కాన్వాయ్‌లో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో కోవిడ్ సమీక్ష సమావేశం ముగిసే సమయానికి ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM