మూడు కళ్ల దూడ జననం...పిడొత్పత్తి సరిగా జరగనందువల్లేనన్న వైద్యులు

by సూర్య | Mon, Jan 17, 2022, 05:19 PM

వింతలు కాదు పిండం సరిగా ఎదగకపోతే పుట్టుకలో లోపాలు  గానీ వింతలు  గానీ జరగవచ్చు.  ఇలాంటి ఘటనయే చత్తీష్ ఘడ్ లో చోటు చేసుకొంది. చత్తీస్ గఢ్ లోని రాజనందగావ్ జిల్లాలో వింత దూడ జన్మించింది. అన్ని దూడలకు రెండు కళ్లు ఉంటే ఈ దూడకు మూడు కళ్లు ఉన్నాయి. శివుడి త్రినేత్రంలా ఈ దూడ నుదుటి మధ్యలో మూడో కన్ను ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. శివుడి ప్రతిరూపం అంటూ ఆ దూడకు కొబ్బరికాయలు కొట్టి హారతులు పడుతున్నారు. ఆ దూడకు పూజలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా, ఈ దూడకు రెండు నాసికా రంధ్రాలకు బదులు నాలుగు నాసికా రంధ్రాలు ఉన్నట్టు గుర్తించారు.  ఈ లేగదూడ నీరజ్ అనే వ్యక్తికి చెందినది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీన్ని తాము భగవంతుని అంశగా భావిస్తున్నామని, దైవం అందరికీ దర్శనమివ్వడానికి ఇలా జన్మించినట్టు అభిప్రాయపడ్డారు. ఈ దూడ మకరసంక్రాంతి రోజున జన్మించిందని వెల్లడించారు. మొదట నుదుటి మధ్యలో ఉన్న కన్నును చూసి అక్కడేదో గాయం అయిందని అనుకున్నామని, టార్చ్ లైట్ వెలుగులో పరిశీలనగా చూస్తే అది కన్ను అని అర్థమైందని వివరించారు. ఈ వింత దూడను స్థానిక పశువైద్యులు పరిశీలించారు. పిండం సరిగా ఎదగని పరిస్థితుల్లో ఇలాంటి మార్పులతో దూడలు జన్మిస్తుంటాయని వారు వివరించారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM