కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి

by సూర్య | Mon, Jan 17, 2022, 04:04 PM

విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖమంత్రి ఉండటం దురదృష్టకరమని టి. ఎన్. ఎస్. ఎఫ్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మొవ్వ శరత్ చంద్ర విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆట లాడటమేనన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలని, 15 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందన్నారు. గతంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదని విమర్శించారు.


విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి , ఉండటం దురదృష్టకరమని, కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుంది. పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేసారు.


ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత మంత్రి తీసుకుంటాడా అని ప్రశ్నించారు.? విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి దొరకటం కడు శోచనీయం. పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలనే డిమాండ్‌ చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM