విచారణకు నాలుగు వారాల గడువు ఇవ్వండి

by సూర్య | Mon, Jan 17, 2022, 02:21 PM

విచారణకు హాజరు కావడానికి నాలుగు వారాల సమయం కావాలని ఏపీ సీఐడీ అధికారలకు ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందు హైదరాబాదులోని రఘురాజు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులను అందజేశారు. నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం ఈరోజు సీఐడీ విచారణకు రఘురాజు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీకి రఘురాజు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ఈనాటి విచారణకు హాజరు కాలేకపోతున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. విచారణకు హాజరు కావడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరారు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM