సీఎం జగన్ కు రాష్ట్ర లారీ యజమానుల సంఘం లేఖ

by సూర్య | Mon, Jan 17, 2022, 02:02 PM

ఈ నెల 1 నుంచి పెంచిన హరితపన్ను వసూళ్లను నిలిపివేయాలని సీఎం జగన్ కు...రాష్ట్ర లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ వల్ల రవాణా రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని, రోజువారీ ఖర్చులు రావడం కూడా ఇబ్బందిగా మారిందని.............. లారీ యజమానుల సంఘం ఆవేదన వ్యక్తంచేసింది. ఫైనాన్స్  సంస్థలకు నెలసరి వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో... దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్నును 200 రూపాయల నుంచి 20వేలకు పెంచి వసూలు చేస్తోందని ఆక్షేపించారు. ఏపీలో పెట్రోల్ ,డీజిల్ ధరలు సరిహద్దు రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉన్నాయని, వెంటనే వ్యాట్  తగ్గించాలని కోరింది. గుంతల మయమైన రహదారులపై నెమ్మదిగా వెళ్లాల్సి రావడం వల్ల  డీజిల్ వినియోగం పెరిగి నష్టపోతున్నారని లేఖలో సీఎం కు తెలిపారు. అన్ని జిల్లాల్లో రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.


 


 

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM