ఏపీలో ఇక నైట్ కర్ఫ్యూ

by సూర్య | Mon, Jan 17, 2022, 12:01 PM

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య వేళల్లో ఉంటోంది. సంక్రాంతి పండగసీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు కూడా విధించకపోవడం వల్ల కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇదివరకే రాత్రిపూట కర్ఫ్యూనువిధించినప్పటికీ.. దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది.


ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 26,770గా నమోదయ్యాయి. 14,510 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు-1,124, విశాఖపట్నం-1,028 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో మరే ఇతర జిల్లాలోనూ రోజువారీ కేసులు రికార్డు కాలేదు.


 


అనంతపురం-147, తూర్పు గోదావరి-233, గుంటూరు-368, కడప-173, కృష్ణా-207, కర్నూలు-168, నెల్లూరు-253, ప్రకాశం-178, శ్రీకాకుళం-187, విజయనగరం-209, పశ్చిమ గోదావరి-95 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను విధించనుంది. మంగళవారం నుంచి ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను విధించనుంది.


 


దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే జారీ చేసింది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిజానికి- ఆరు రోజుల కిందటే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలులోకి తీసుకుని రావాలని నిర్ణయించుకున్నప్పటికీ.. దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.


 


పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి వచ్చే వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాత్రిపూట కర్ఫ్యూలో మార్పులు చేసింది. 18వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ వైద్య ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అప్పట్లో తెలిపారు. సంక్రాంతి పండగ సీజన్ ముగిసినందున- ఇక మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో కొనసాగుతుంది.

Latest News

 
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్ డేట్స్ Fri, Apr 19, 2024, 12:28 PM
టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు Fri, Apr 19, 2024, 12:27 PM
సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు Fri, Apr 19, 2024, 12:26 PM
చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదు Fri, Apr 19, 2024, 12:25 PM