ముగిసిన సెలవులు.. తెరుచుకున్న పాఠశాలలు

by సూర్య | Mon, Jan 17, 2022, 11:40 AM

ప్రభుత్వ విద్యాసంస్థలకు పండగ సెలవులు ముగిసాయి. సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే సెలవులు ప్రకటించిన 8వ తేదీ రెండవ శనివారం, 9న తేదీ ఆదివారం సెలవులు పండగ సెలవుల్లో కలిసిపోయిన దృష్ట్యా రెండు రోజుల పాటు సెలవులు పొడిగించాలన్న ఉపాధ్యాయుల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. వాస్తవంగా పండగ సెలవులు పది రోజులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారం రోజుల పాటే కేటాయించడం, అందులోనూ రెండు రోజులు ప్రభుత్వ సెలవులు పోవడంతో ఈ సారి పండగ సెలవులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


పండగ సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ మరో సారి నిర్ణయం తీసుకోవచ్చని భావించినప్పటికీ అటువంటి ప్రకటన ఏదీ ఆదివారం సాయంత్రం వరకు వెలువడలేదు. పండుగ రోజులు పూర్తికాకముందే సెలవులు ముగిసి మరలా పాఠశాలలు తెరుచుకోవడంతో పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Latest News

 
వైభవంగా శ్రీ అంబమ్మ దేవి రథోత్సవంలో Wed, Apr 24, 2024, 12:25 PM
ఇనాయతుల్లాను కలిసి అభినందనలు తెలిపిన విద్యార్థి సంఘాలు Wed, Apr 24, 2024, 12:22 PM
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM