ఏపీ ప్రభుత్వానికి జర్మనీ బ్యాంకు సాయం

by సూర్య | Mon, Jan 17, 2022, 11:36 AM

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించేందుకు జర్మనీకి చెందిన బ్యాక్ ముందుకు వచ్చింది. ఈ ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ ముందుకు వచ్చింది. ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలుకు 150 మిలియన్ యూరోలు, సాంకేతిక సహకారానికి మరో 2 మిలియన్ యూరోలు అందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు కాలనీల్లో విద్యుత్‌ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM
లోకం మాధవి ఆస్తుల విలువ తెలిస్తే షాకె Sat, Apr 20, 2024, 02:08 PM