విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి కరోనా

by సూర్య | Sun, Jan 16, 2022, 10:36 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి కూడా  కరోనా వైరస్‌ ప్రవేశించింది. ఆలయ అర్చకులలో ఓ అర్చకుడికి కరోనా సోకింది. సదరు అర్చకుడికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇతర అర్చకుల కు సైతం కరోనా పరీక్షీలు నిర్వహించారు. అమ్మవారి దర్శనాల్లో కూడా మార్పులు చేశారు. అంతరాలయంలోకి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఆలయంలో క్యూలైన్లను ఎప్పటికప్పుడూ శానిటైజ్‌ చేస్తున్నామని, భక్తులు కూడా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ ఆలయ ఈవో భ్రమరాంబ సూచించారు. రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత దానికి అనుగుణంగా దర్శన వేళల్లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలో అందరూ పండుగ సంబరాల్లో ఉన్న సమయంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం కరోనా కేసులు ఏకంగా 4,955 నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 509 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22, 870 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 397 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 64 , 331 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 35, 673 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 18 , 32, 010 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు వినియోగం తప్పని సరి చేసారు. మాస్కు లేకుంటే జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. రేపటి నుంచి సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కానుంది. టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు సాధించింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM