ఎంసీఎల్ఆర్ తగ్గించిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

by సూర్య | Sun, Jan 16, 2022, 08:35 PM

హోమ్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటోన్న వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. ఈ బ్యాంకు ఎంసీఎల్ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అంటే 0.10 శాతం మేర ఎంసీఎల్‌ఆర్ దిగొచ్చింది. కొత్త రేట్లు నేటి నుంచి అంటే 16 జనవరి, 2022 నుంచి అమల్లోకి వస్తాయని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పేర్కొంది. పర్సనల్ లోన్లు, ఆటో లోన్లు, హోమ్ లోన్లను మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటుకు అనుగుణంగా జారీ చేస్తారు. వన్ ఇయర్ ఎంసీఎల్ఆర్ 7.45 శాతంగా ఉంటుందని, జనవరి 16, 2022 నుంచి ఈ ఎంసీఎల్ఆర్ అమల్లోకి వస్తుందని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పేర్కొంది. అదేవిధంగా నెల, మూడు నెలలు, ఆరు నెలల వ్యవధి గల ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లను కూడా బ్యాంకు తగ్గించింది. అయితే ప్రస్తుత బేస్ రేటుపై మాత్రం బ్యాంకు ఎలాంటి తగ్గింపు చేపట్టలేదు. ఎంసీఎల్ఆర్ విధానాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డెవలప్ చేసింది. దీని బట్టి బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఎంసీఎల్ఆర్ విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అంతకుముందు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఒక వడ్డీ రేటును నిర్ణయించేవి. బేస్ రేటు స్థానంలో ఎంసీఎల్ఆర్‌ను ఏప్రిల్ 2016 నుంచి బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్‌ను తగ్గించినా.. పెంచినా ఈ ప్రభావం లోన్ కస్టమర్లపై పడుతోంది.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM