తవ్వకాల్లో బయటపడ్డ పురాతన దేవాలయ ఆనవాళ్ళు

by సూర్య | Sun, Jan 16, 2022, 11:04 AM

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్పోస్ట్ నుండి సిరా వరకు నిర్మిస్తున్న రహదారి పనుల్లో భాగంగా సంబంధం లేని చోట ఎస్సార్సీ కాంట్రాక్టర్లు తవ్వకాలు జరిపారు.


దింతో అక్కడ అతి పురాతన మైన దేవాలయ ఆనవాళ్లు కలిగిన స్తంభాలు బయటపడడంతోవాటిని చూసిన గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని దేవాలయం గతంలో ఉండేదని పురావస్తు దేవాలయ అని అక్కడికి వస్తున్న గ్రామ పెద్దలు తెలుపుతున్నారు.


లేపాక్షి పెద్ద చెరువులో  భాగంలో మట్టి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ స్తంభాలు బయటపడడంతో గుట్టుచప్పుడు కాకుండా వాటి పై మట్టిని కప్పే ప్రయత్నం చేశారని. ఆ సంఘటన చూసిన ప్రజలు అక్కడికి వెళ్లడం తో కాంట్రాక్టర్లు చేసేదేమీలేక వెనుదిరిగారు.


ఈ సంఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఆ స్తంభాలను పరిశీలించి దాని వెనుక ఉన్న రహస్యం దానితో పాటు దాని యొక్క ప్రాముఖ్యత తెలపాలని లేపాక్షి ప్రజలు చర్చించుకుంటున్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM