అనంతలో బంగారు నాణేల కలకలం

by సూర్య | Sun, Jan 16, 2022, 11:00 AM

అనంతపురం జిల్లాలో బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఓ రైతును కర్ణాటకకు చెందిన ముఠా బురిడీ కొట్టించి బంగారు నాణాలు అని నకిలీవి అంటగట్టి 10 లక్షల నగదు దండుకున్నట్లు తెలుస్తోంది. బాధితులు తేరుకునేలోపే వారు అక్కడినుండి ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


పోలీసుల వివరాల మేరకు తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజాకుంట గ్రామానికి చెందిన రమేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈనెల ఎనిమిదో తేదీన అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు రమేష్ అని ఊరు బళ్లారి అని ఇటీవల తన పొలంలో బంగారు నాణాలు లభించాయని తక్కువ ధరకే అమ్మాలని అనుకుంటున్నానని తెలిపాడు. పరమేష్ కు నమ్మకం కుదరకపోవడంతో వీడియో కాల్ ద్వారా బంగారు నాణేలను చూపించాడు. ఒకటిన్నర కిలోల బంగారు నాణేలను పది లక్షలకే అమ్ముతామనడంతో పరమేష్ ఆశపడ్డాడు. ఈ నెల 10న రమేష్ నేరుగా బళ్లారికి వెళ్లగా రమేష్ వారి ముఠా ఓ బంగారు నాణాన్ని ఇచ్చి చెక్ చేసుకోవాలని సూచించారు. అది బంగారు నాణెం అని తేలింది. పది లక్షలు ఇస్తానని బంగారు నాణాలు ఇవ్వాలని కోరారు. మీరు వెళ్ళండి తరువాత చిరునామా చెబుతామని రమేష్ చెప్పడంతో పరమేష్ వెళ్ళిపోయాడు. ఈ నెల 13న రమేష్ పరమేష్ కు ఫోన్ చేసి 14వ తేదీన అనంతపురం రూరల్ మండలం కురుగుంట శివారులోని వైఎస్ఆర్ కాలనీకి రావాలని తెలిపారు. దీంతో పరమేష్ అతని సోదరుడు మహేష్ అనంతపురం చేరుకున్నారు.


వైఎస్ఆర్ కాలనీకి చేరుకున్న పరమేష్ సోదరుల వద్దకు ద్విచక్ర వాహనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకటిన్నర కిలోల నకిలీ బంగారు నాణేలను ఇచ్చి 10 లక్షలు నగదు వారీ మొబైల్ ఫోన్ లాక్కొని ఉడాయించారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM