రైతన్నకు నిరాశే.!

by సూర్య | Sun, Jan 16, 2022, 10:38 AM

ఆరుగాలం శ్రమించి పండిచిన పంటసొమ్ములు సంక్రాంతి పండుగ నాటికి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఆశ పడ్డ రైతన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి పండించినపంటకు గిట్టుబాటుకాక పోయినా మద్దతు ధరకు విక్రయించిన రైతన్నకు ధాన్యం సొమ్ములు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.


ధ్యానం సొమ్ములతో సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవచ్చని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. దీంతో పండగా పూట రైతులతో పాటు, రైతు అనుబంధంగా ఉన్న వారు కూడా పస్తులతో గడపాల్సిన దుస్థితి గ్రామాల్లో నెలకొంది. ఇప్పటికే ధాన్యం విక్రయించి 45 రోజులు గడిచినా నేటికి రైతు ఖాతాలో పంట సొమ్ములు పడకపోవడంతో రైతులు అసంతృప్తి చెందుతున్నారు. సంక్రాంతికి రైతుల ఇంట ధాన్యం రాశుల సిరుల వర్షం కురిపిస్తాయి. రైతులకు ధాన్యం సొమ్ములు అందడంతో రైతుల ఇళ్లలో పండగా వాతావరణ నెలకొంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగా వాతావరణం రైతుల ఇళ్లలో కనిపించడం లేదు.


జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో దాదాపు 8. 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఖరీఫ్లోనే 10లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో 37, 874 మంది రైతుల నుంచి రూ. 663. 49 కోట్ల విలువైన 3, 39, 200 మె. టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అయితే జిల్లాలో గత 50 రోజుల్లో సేకరించిన ధాన్యానికి సంబంధించి 10శాతం మంది రైతులు మాత్రమే వారి ఖాతాలో నగదు పండినట్లు చెబుతున్నారు.


ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన రైతులు సకాలంలో నగదు చేతికి అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పంట కోసం తీసుకువచ్చిన అప్పులు కూడా చెల్లించకపోవడంతో రైతులు వ్యాపారుల నుంచి తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్నారు.


పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు వాటిని విడిపించుకోవాలని ఎదురు చూస్తున్నారు. జాప్యం జరిగే కొద్దీ వడ్డీ భారం పెరిగిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట బకాయిలు వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM