రోడ్లను కంగనా రౌనత్ బుగ్గల చేస్తా

by సూర్య | Sat, Jan 15, 2022, 08:21 PM

హీరోయిన్ల అందచందాలను తమ రాజకీయా ప్రసంగాలలో నేతలు వర్ణించడం పరిపాటిగా మారింది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు బాలీవుడ్ అందాలభామ కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా మెరిసిపోవాలంటూ రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట విమర్శల పాలయ్యాయి. తాజాగా, ఝార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. తన జమ్తారా నియోజకవర్గంలో 14 అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందని, ఆ రోడ్లు నటి కంగనా రనౌత్ బుగ్గల కంటే మృదువుగా ఉంటాయని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోలో వెల్లడించారు. రోడ్లను నటీమణులు చెక్కిళ్లతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో రోడ్లను డ్రీమ్ గాళ్ హేమమాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM