పండుగ వేళ...ఇదేంటి...నరేంద్రను వెంటనే విడుదల చేయాలి

by సూర్య | Sat, Jan 15, 2022, 05:18 PM

వైసీపీ ప్రభుత్వ చర్యలపై  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ రోజు చేయని తప్పుకు రైతు నరేంద్రను జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతు లోకం క్షమించదు అన్నారు. పంటకు మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించింది. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చెయ్యాలి.. వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM