ఈసారి కూడా గోద కళ్యాణం రద్దు:టీటీడీ

by సూర్య | Sat, Jan 15, 2022, 05:17 PM

కరోనా కారణంగా టీటీడీ  ఈసారి కూడా గోద కళ్యాణంను రద్దు చేసింది. కరోనా కేసుల పెరుగుదలయే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించాల్సిన గోదా కళ్యాణం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ గత ఏడాది గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే ప్రకారం ఈసారి కూడా గోద కళ్యాణం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం రద్దు చేసింది. దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీకి ఆయన అందించిన సేవలు అమూల్యమని అన్నారు. చంద్రశేఖర శాస్త్రి పురాణ ప్రవచనానికి ఒక స్థాయి కల్పించిన మహానుభావుడని అన్నారు. టీటీడీ పురాణ ప్రబోధ కళాశాలకు ప్రిన్సిపల్‌గా పని చేసిన కాలంలో ఎందరో ఉత్తమ ప్రవచన కర్తలను ఆయన తయారు చేశారని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాన కర్తగా, ధార్మిక ఉపన్యాస కర్తగా స్వామివారి సేవలో తరించారని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేశారన్నారు. 19 సంవత్సరాల వయస్సులో పురాణ ప్రవచన ప్రయాణం ప్రారంభించిన మల్లాది చంద్ర శేఖర శాస్త్రి ఆరు దశాబ్దాల పాటు అనేక రూపాల్లో హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగించారని తెలిపారు. చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు వేంకటేశ్వర స్వామి వారు శాంతి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. ఆ కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM