సంక్రాంతి సందడి:గుర్రం ఎక్కిన బాలయ్య
 

by Suryaa Desk |

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ హీరో, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆచారబద్దంగా గత ఆచారాలను ఆయన అస్వాధీంచారు. సంక్రాంతి పండుగ‌ను ఆయన ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నారు. పండుగ సంద‌ర్భంగా ఆయ‌న గుర్రంపై కూర్చొని సంద‌డి చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా బాలకృష్ణ తన అక్క పురంధేశ్వ‌రి ఇంటికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో ప్రకాశం జిల్లా కారంచేడులో ఉన్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా కొంద‌రు గుర్రం తీసుకురాగా దానిపై ఎక్కి బాకృష్ణ‌ గుర్రపు స్వారీ చేస్తున్నట్లు పోజు ఇచ్చారు. బాలకృష్ణ కుమారుడు నంద‌మూరి మోక్షజ్ఞ  కూడా గుర్రం ఎక్కాడు. కాగా, బాల‌కృష్ణ కారంచేడు వ‌చ్చార‌ని తెలుసుకున్న స్థానికులు ఆయ‌న‌ను చూసేందుకు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. అక్క‌డ ఉన్న గోడ‌లు ఎక్కి మ‌రీ బాల‌య్య చేసిన సంద‌డిని చూశారు.

Latest News
ఆ రైతులకు అలర్ట్... ! Tue, Jan 18, 2022, 12:49 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం Tue, Jan 18, 2022, 12:10 PM
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త Tue, Jan 18, 2022, 11:48 AM
స్మార్ట్ ఫోన్ బారినుండి కంటిచూపును కాపాడుకోండిలా Tue, Jan 18, 2022, 11:21 AM
వారికీ ఏపీ ప్రభుత్వం షాక్‌...! Tue, Jan 18, 2022, 10:51 AM