టీడీపీ హయాంలో దేవాలయాలను కూల్చితే సోము ఏం చేశారు

by సూర్య | Fri, Jan 14, 2022, 10:47 PM

టీడీపీ హయాంలో దేవాలయాలను కూల్చుతూవుంటే అపుడు బీజేపీ నేత సోమువీర్రాజు ఏం చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, సోము వీర్రాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, ఆ విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇటీవల టిడిపి నేత చంద్రయ్య హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి హత్యా రాజకీయాలు చేస్తున్న వైసీపీ అంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు సంక్రాంతి వేడుకలలో భాగంగా భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని, చంద్రబాబు ఆలోచనలే రాక్షస ఆలోచనలు అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంటల్లో తగలబడాలని కోరుకుంటున్నానని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. పండుగ వేళ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని చంద్రబాబుకు హితవుపలికారు వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు హయాంలో దేవాలయాలు కూల్చి వేస్తుంటే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. మత విద్వేషాలను సోము వీర్రాజు రెచ్చగొడుతున్నారని వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై సోము వీర్రాజు ఎందుకు మాట్లాడడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. వైసీపీపై రౌడీయిజం నింద వెయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కోరిక నెరవేరదని తేల్చిచెప్పారు. నీఛ, దరిద్ర, హత్య, కుట్ర రాజకీయాలను చేయడాన్ని చంద్రబాబు మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM