గాల్లో వైరస్ ఉంటే దాని సామర్థ్యం 90శాతం క్షీణిస్తుంది

by సూర్య | Fri, Jan 14, 2022, 10:46 PM

కరోనా వైరస్ 20 నిమిషాలపాటు గాల్లో ఉంటే దాని సామర్థ్యం దాదాపు 90 శాతం క్షీణిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. రోజు రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, యూకేలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 8 లక్షలకుపైగా కరోనా బారిన పడ్డారు. భారత్‌లోనూ గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ గాల్లో ఎంత సేపు దాని ప్రభావం ఉంటుందన్న దానిపై జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికమైన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ జరిపిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్ 20 నిమిషాలపాటు గాల్లో ఉంటే దాని సామర్థ్యం దాదాపు 90 శాతం క్షీణిస్తుందని వెల్లడించింది. వైరస్ గాల్లో ఉన్న మొదటి ఐదు నిమిషాల్లోనే అధికశాతం దాని సంక్రమణ శక్తిని కోల్పోతున్నట్లు ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ , ప్రొఫెసర్ జోనాథన్ రీడ్ తెలిపారు. అయితే అధ్యయనాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉందని పేర్కొన్నారు. గాలి , వెలుతురు సరిగా లేని ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అందరూ వీటిపై దృష్టి పెడుతున్నారని ప్రొఫెసర్ జోనాథన్ రీడ్ అన్నారు. అయితే అలా జరగదని తాను భావించడం లేదు. కానీ, ప్రజలు దగ్గర దగ్గరగా ఉంటేనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే కరోనా వైరస్ కట్టడికి మాస్కులు వాడకం తప్పనిసరి అని శాస్త్రవేత్తలు నొక్కిచెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిండం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM