తెలుగుదేశం నేత హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.  సిమెంట్ రోడ్డు విషయంలో తోట చంద్రయ్య, ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య మధ్య మూడేళ్ల క్రితం గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జనవరి 10న గ్రామంలోని తన మేనమామ కూతురు ఓణి కార్యక్రమానికి హాజరైన తోట చంద్రయ్య.. అక్కడికి వచ్చిన బంధువులతో కలిసి చింత శివరామయ్యను హత్య చేస్తానని చెప్పాడు.ఈ విషయం తెలుసుకున్న శివరామయ్య తన కుమారుడితో కలిసి మరో ఆరుగురితో కలిసి చంద్రయ్యను హత్య చేయడానికి ముందు హత్యకు పథకం వేశాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యపై చింతా శివరామయ్య మరో 7 మంది కత్తులతో హత్యా చేసి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులందరినీ  అరెస్టు చేశారు.

Latest News
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం Tue, Jan 18, 2022, 12:10 PM
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త Tue, Jan 18, 2022, 11:48 AM
స్మార్ట్ ఫోన్ బారినుండి కంటిచూపును కాపాడుకోండిలా Tue, Jan 18, 2022, 11:21 AM
వారికీ ఏపీ ప్రభుత్వం షాక్‌...! Tue, Jan 18, 2022, 10:51 AM
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు Tue, Jan 18, 2022, 09:58 AM