80 శాతం మంది ఒకవైపు, 20 శాతం మంది మరొక వైపు

by సూర్య | Fri, Jan 14, 2022, 10:13 PM

తన పార్టీలో పెరుగుతున్న వలసలతో  యూపీ ఎన్నికల్లో గెలుపుపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.  80 శాతం మంది ఒకవైపు, 20 శాతం మంది మరొక వైపు అంటూ బీజేపీ వైపు 20శాతం ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరింత దూకుడు పెంచారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రోజుకోకరు కాషాయ పార్టీకి వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇక సైకిల్ స్పీడ్‌ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలుచుకుంటామని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీ కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో 80 శాతం మంది ఒకవైపు, 20 శాతం మంది మరొక వైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ, వారి అంచనాలు తల్లకిందులు కావడం ఖాయమని అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. బాహుశా యోగి మాట‌ల్లో బీజేపీకి 20 శాతం స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీకి 80 శాతం స్థానాలు లభిస్తాయనేది సారాంశం కావచ్చని సైటైర్లు వేశారు. సీఎం యోగి ఓ లెక్కల మాస్టారును నియమించుకోంటే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన ప్రసాద్‌ స్వామి మౌర్య, ధరంసింగ్‌తో సహా ఇతర బిజెపి ఎమ్మెల్యేలు అఖిలేష్‌ సమక్షంలో సమాజ్‌వాదీలో చేరారు

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM