పిల్లల వల్లే...అన్ని వ్యూస్ వచ్చాయంటా

by సూర్య | Fri, Jan 14, 2022, 09:22 PM

ఈ రోజుల్లో యూట్యూబ్ లో వ్యూస్ రాబట్టడం అంతా ఈజీ ఏమీ కాదు. కానీ ఓ వీడియోను చిన్న పిల్లలు తెగచూడటంతో వ్యూస్ లో రికార్డు సాధించింది. ఓ వీడియో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధిస్తే గొప్ప విషయంగానే భావించాలి. అదే పది మిలియన్ల వ్యూస్ (కోటి) సాధిస్తే ఇంకాస్త గొప్ప అనుకోవాలి. అలాంటిది ఓ వీడియో 1000 కోట్ల వ్యూస్ సాధిస్తే దాన్నేమనాలి? అంతకంటే ముందు, అసలు ఆ వీడియోలో ఏముందన్న ఆసక్తి కలుగుతుంది. అదొక పిల్లల మ్యూజిక్ వీడియో. 'బేబీ షార్క్ డ్యాన్స్' అనే ఆ వీడియోలో కొందరు చిన్నారులు, పలు యానిమేషన్ బొమ్మలు హుషారైన పెర్ఫార్మెన్స్ తో అలరించడం చూడొచ్చు. ఈ వీడియో నిడివి 2 నిమిషాలకు పైనే ఉంటుంది. 'పింక్ ఫాంగ్' అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేసిన ఈ 'బేబీ షార్క్ డ్యాన్స్' వీడియోను ఇప్పటివరకు 1000,89,32,715 సార్లు చూశారు. ఈ వీడియోకు 3.2 కోట్ల లైకులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో ఈ పాటకు విశేషమైన క్రేజ్ ఉంది. ఇందులో పెద్దగా సాహిత్యం లేకపోయినా, పాట ఎంతో లయబద్ధంగా సాగుతుంది.

Latest News

 
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM