బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ నిర్దోషి: తీర్పు ఇచ్చిన న్యాయస్థానం

by సూర్య | Fri, Jan 14, 2022, 09:08 PM

ఓ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు హాట్ టాపిక్ గా మారింది. క్రైస్తవ సన్యాసిపై 2014 నుంచి 2016 మధ్యకాలంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. క్రైస్తవ సన్యాసిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిషప్ ఫ్రాంకోపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దేశంలో అత్యాచారం ఆరోపణలతో అరెస్టయిన తొలి క్యాథలిక్ బిషప్‌ ఫ్రాంకో కావడం గమనార్హం. తన క్లయింట్ కోర్టు, పోలీసులకు పూర్తిగా సహకరించాడని ఆయన తరఫున లాయర్ తెలిపారు. ఫ్రాంకో ములక్కల్‌పై అత్యాచారం, బెదరింపులు, బలవంతపు నిర్బంధం తదితర కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఈ కేసులన్నింటినీ కొట్టాయం కోర్టు కొట్టివేసింది. 100 రోజులకుపైగా జరిగిన విచారణలో ఫ్రాంకో ములక్కల్ అత్యాచారానికి పాల్పడినట్టు రుజువు కాకపోవడంతో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. జలంధర్ డియోసెస్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌.. లైంగిక‌దాడికి పాల్ప‌డినట్టు 2018 జులైలో సన్యాసిని ఫిర్యాదు చేయడంతో కురవిలంగాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మిషనరీస్ ఆఫ్ జీసస్ కాన్వెంట్‌లో సన్యాసినిపై బిషప్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని జాతీయ మహిళా కమిషన్ సైతం డిమాండ్‌ చేసింది. ఢిల్లీలోని వాటికన్ రాయబారి గియాంబట్టిస్టా డిక్వాట్రోకు అనేక మహిళా సంస్థలు మెమోరాండం సమర్పించాయి. బిషప్‌ స్థానం నుంచి అతడిని తొలగించాలని పోప్‌కు సలహా ఇవ్వాలని వారు అభ్యర్థించారు. బాధిత న‌న్‌ వాటికన్ రాయబారికి లేఖ రాస్తూ.. తనకు న్యాయం జరిగేలా వాటికన్ పెద్ద‌లు జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ క్ర‌మంలో చర్చి వ్యతిరేక వ్యక్తులు ఆమెను ఇలా ఉసిగొల్పుతున్నార‌నీ, అందుకే న‌న్ ఇలా ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ బిషప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప‌లువిమ‌ర్శ‌లు చేశారు. తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ములక్కల్‌ను 2018 సెప్టెంబరులో అరెస్టు చేయగా... దాదాపు రెండేళ్ల తర్వాత 2020 ఆగస్టులో బెయిల్‌పై ఆయన బయటకొచ్చారు. తాజాగా, కొట్టాయం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ తీర్పుపై పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. బిషప్ ములక్కల్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సమర్పించామని, సాక్షులు ఎవరూ ఆయనకు అనుకూలంగా మారలేదని కొట్టాయం ఎస్పీ హరి శంకర్ అన్నారు.

Latest News

 
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM
చంద్రబాబు పుట్టినరోజు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ Sat, Apr 20, 2024, 07:55 PM
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM