క్రిబ్కో ఎరువుల ఇండస్ట్రీ పునరుద్ధరణక్రిబ్కో ఎరువుల ఇండస్ట్రీ పునరుద్ధరణ

by సూర్య | Fri, Jan 14, 2022, 09:04 PM

నెల్లూరు జిల్లా వాసులకు  కేంద్రం ఓ శుభవార్త వినిపించింది. నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఎరువుల ఇండస్ట్రీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో తిరుపతి ఎంపీ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో నెల్లూరు జిల్లాలో ఉన్న ఎరువుల ఇండస్ట్రీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటానని.. ఫిబ్రవరిలో క్రిబ్కో చైర్మన్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఉన్న క్రిబ్కో ఎరువుల తయారీ పరిశ్రమ ను పునరద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నూతన, పునరుత్పాదక శాఖ కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుభ హామీ ఇచ్చారు. ఆయన తిరుమల పర్యటన ముగించుకుని వెళ్తూ తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి కార్యాలయంలో ఎంపీతో కొద్దిసేపు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ క్రిబ్కో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరిలో క్రిబ్కో చైర్మన్ పిలిచి సర్వేపల్లి యూనిట్ ప్రారంభించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ ఇథ్నాల్ తయారీ కేంద్రంగా కాకుండా డీఏపీ ఎరువులు తయారీ కేంద్రంగానే ప్రారంభిస్తేనే.. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మేలు అని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సముద్ర తీరప్రాంతంలో విండ్ మిల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎంపీ గురుమూర్తి మంత్రిని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అధ్యాయనం చేయిస్తామని హమీ ఇచ్చారు. దాదాపు అర్థగంటకుపై గా ఈ మర్యాదపూర్వక భేటీ సాగింది. అలాగే రాష్ట్రంలో ఎరువులు కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ దృష్టి కి తీసుకొస్తే 48 గంటల్లోనే అవసరమైన ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM