జీవిఎల్ కు వరించిన పదవి
 

by Suryaa Desk |

బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నర్సింహారావు కు కీలక నామినేటెడ్ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పొగాకు బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్‌కు రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. డిసెంబర్ 14, 2021న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి.. రాజ్యసభ సభ్యుల నుంచి పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ను ఎన్నిక చేశారు. ఇద్దరు లోక్‌సభ సభ్యులు పొగాకు బోర్డుకు కొంత కాలం కిందట ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి బండి సంజయ్, ఏపీ నుంచి బాలశౌరి.. లోక్‌సభ నుంచి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు.జీవీఎల్ నరసింహారావు తన ఎన్నికపై హర్షం వ్యక్తం చేస్తూ పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తానని, వారి సంక్షేమం కోసం, పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత చురుకుగా పనిచేస్తానని తెలిపారు. జీవీఎల్ నరసింహారావు గతంలో రాజ్యసభ ద్వారా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. మిర్చి జాతీయ టాస్క్‌ఫోర్స్ కమిటీకి చైర్మన్‌గా కూడా నియమితులయ్యారు.

Latest News
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM
వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు: గుంటుపల్లి శ్రీదేవి చౌదరి Sat, Jan 29, 2022, 02:27 PM
తూర్పగోదావరి జిల్లాలో దారుణం.. భర్త విసిగిస్తున్నాడని మర్మాంగం కట్ చేసి హతమార్చింది Sat, Jan 29, 2022, 02:17 PM