గత ఏడాది ఎండలు దంచేశాయ్: ఇది నిజమే

by సూర్య | Fri, Jan 14, 2022, 08:15 PM

గత ఏడాది ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రత్తలు పెరగడంవల్ల ఎండలతో ప్రజలు బెంబెలెత్తారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వార్షిక వాతావరణ నివేదిక విడుదల చేసింది. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 1901 నుంచి చూస్తే 2021 సంవత్సరం అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 5వ స్థానంలో ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. భారత్ లో గతేడాది వార్షిక సగటు ఉపరితల ఉష్ణోగ్రత 0.44 డిగ్రీల సెల్సియస్ ను మించినట్టు తెలిపింది. ఆ లెక్కన దేశంలో 2009, 2010, 2016, 2017లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలోనూ వేడి వాతావరణం కొనసాగిందని, ముఖ్యంగా రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో పెరుగుదల చోటుచేసుకుందని ఐఎండీ వివరించింది. ఇదిలావుంటే గతేడాది వరదలు, తుపానులు, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం, పిడుగుపాటు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 1,750 మరణాలు సంభవించినట్టు ఐఎండీ పేర్కొంది.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM