ఆయోధ్య నిర్మాణంపై వీడియో విడుదల

by సూర్య | Fri, Jan 14, 2022, 06:55 PM

రామ మందరి నిర్మాణంపై సాగుతున్న తీరుపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. అయోధ్యలో రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారితీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఈ వీడియోను 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.

Latest News

 
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM