సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ దంపతులు
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సీఎం క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద శుక్రవారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం జగన్ ఎం సాంప్రదాయ పంచెకట్టుతో హాజరై సంబరాలను తిలకించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించగా కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM