కిలాడీ లేడీ.. ప్రియుడి కోసం ఎంత పని చేసిందంటే?

by సూర్య | Fri, Jan 14, 2022, 03:10 PM

పెళ్లి ప్రమాణాలను తుంగతోకి తొక్కిన ఓ మహిళ కట్టుకన్నోడినే కడతేర్చింది. భర్త, పిల్లలు ఉన్నా వారిని కాదని పరాయి వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసి ఆపై నాటకానికి తెరతీసింది. చివరకు పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం తాడేపల్లికి చెందిన నాగరాజు నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన షెమా సోనీని ఎనిమిదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇటీవల దంపతులిద్దరూ పొన్నూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో వీరు నివసిస్తున్న కాలనీలో ఉండే ఓ యువకుడితో సోనీకి పరిచయం ఏర్పడింది.


ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తన సుఖాలకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని అంతం చేయాలని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం ఈ నెల 7వ తేదీన నాగరాజును సోనీ ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆపై శవాన్ని బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలోని కాలువలో పడేశారు. తిరిగి ఇంటికి వచ్చాక తన భర్త కనిపించడం లేదని నాటకానికి తెర తీసింది. అయితే నాగరాజు బంధువులు మాత్రం సోనీ అక్రమ సంబంధం పైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ ప్రారంభించిన పోలీసులు సోనీని ప్రశ్నించగా చివరకు నేరం అంగీకరించింది. సోనీ చెప్పిన ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌తో భారత్ ఢీ Sun, Sep 25, 2022, 10:38 AM
ఏపీలో నేడు జిల్లాల వారీగా వాతావరణ సమాచారం Sun, Sep 25, 2022, 10:33 AM
నేడు దేశవ్యాప్తంగా 4,777 కోవిడ్ పాజిటివ్ కేసులు Sun, Sep 25, 2022, 10:23 AM
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM