ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బాంబు కలకలం

by సూర్య | Fri, Jan 14, 2022, 02:59 PM

మరోసారి భారతదేశంలో రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బాంబు కలకలం రేపింది.2022, జనవరి 14వ తేదీ శుక్రవారం పూల మార్కెట్‌ వద్ద బ్యాగ్‌లో బాంబ్‌ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వెంటనే ఈ సమాచారాన్ని బాంబ్ స్వ్కాడ్ కు అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది..బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబును నిర్వీర్యం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఘాజీపూర్‌ పూలమార్కెట్‌ను ఖాళీ చేయించారు అధికారులు. ఇంకెక్కడైనా పేలుడు పదార్ధాలున్నాయా అన్నదానిపై తనిఖీలు చేస్తున్నారు.ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (IED) స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా వెల్లడించారు. రద్దీగా ఉండే మార్కెట్ లో పాడుబడిన లెదర్ బ్యాగులో దీనిని అమర్చారని తెలిపారు. బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం బ్యాగును ఓ ఓపెన్ గ్రౌండ్ కు తీసుకెళ్లి..8 అడుగుల లోతులో పాతిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని NSG టీం పూర్తిగా చుట్టుముట్టింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM