సోమువీర్రాజు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు
 

by Suryaa Desk |

కృష్ణా జిల్లా: పశ్చిమ నియోజకవర్గంలోని 37 వ డివిజన్ సామా రంగం చౌకలో కార్పొరేటర్ మండెపూడి ఛటర్జీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. డివిజన్ ప్రజలతో పాటు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి, భోగి వేడుకలు ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణి చేసారు. 42 వ డివిజన్లో కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు. కార్పొరేటర్ చైతన్యరెడ్డి స్థానిక మహిళలు, యువతులతో కలిసి భోగి మంటలు చుట్టూ భోగి నృత్యాలు చేసారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భోగి పండుగను ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో ప్రజలు జరుపుకుంటున్నారని, యువత పెద్ద ఎత్తున బోగి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని, 32 లక్షల మందికి సిఎం జగన్ సొంతింటి కలను నెరవేర్చారన్నారు. కరోనా వైరస్ బోగి మంటల్లో ఆహుతి అవ్వాలన్నారు. పండగలను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకొవాలన్నారు. జగన్ సీఎంగా ఎపి లోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చేస్తుంటే సోమువీర్రాజు ఏం చేసారని ప్రశ్నించారు. మత విద్వేషాలను సోమువీర్రాజు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పండగ వేళ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటు అని దుయ్యబట్టారు. వైసిపిపై రౌడీయిజం నింద వేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు.

Latest News
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM