రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
 

by Suryaa Desk |

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బొండపల్లి సమీపంలో లోటుచే సుకుంది... ఈనాడు కథనం ప్రకారం..దుంపవీధికి చెందిన దుంప మహేష్ (43)విజయనగరంలో విధులు ముగించుకుని గురువారం వేకువజ మున గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. అదే మార్గంలో వెనక నుంచి వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో తల పై గాయాలైన ఆయనను స్థానికులు 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాసుదేవ్ తెలిపారు.

Latest News
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM