ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలి: కలెక్టర్
 

by Suryaa Desk |

అనంతపురం: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోపు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఔట్ ను జాయింట్ కలెక్టర్ ఏ. సిరి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. జగనన్న కాలనీ లో విద్యుత్ సరఫరా, నీటి వసతి, తద్వారా అన్ని రకాల మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM