ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే పద్మావతి

by సూర్య | Fri, Jan 14, 2022, 12:58 PM

అనంతపురం: ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కొండమీద శ్రీ వెంకటరమణ స్వామికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలందరూ హాయిగా, ఆనందంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు కావల్సినవన్నీ ముఖ్యమంత్రి జగనన్న సమకూర్చుతున్నారని, ఇంటి వద్దకే రేషన్ వస్తోందని తెలిపారు. కరోనా ప్రకంపనలు వినిపిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రజలు పడిన అవస్థలను చూసిన ముఖ్యమంత్రి ముందుగా స్పందించి, రాష్ట్రంలో పలుచోట్ల ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేశారని తెలిపారు. పలు ప్రభుత్వాసుపత్రుల్లో ప్లాంట్లను సిద్ధం చేసినట్టు వివరించారు. ఆ దేవుని ఆశీస్సులు ఉండటం వల్లనే ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి మనందరకు దొరికారని పేర్కొన్నారు.

Latest News

 
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు Sun, Sep 25, 2022, 11:30 AM
14వ రోజు గుడివాడలో ప్రారంభమైన మహా పాదయాత్ర Sun, Sep 25, 2022, 11:25 AM
విజయవాడ పరిధిలో 2500 స్పెషల్ బస్సులు Sun, Sep 25, 2022, 11:12 AM
ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌తో భారత్ ఢీ Sun, Sep 25, 2022, 10:38 AM
ఏపీలో నేడు జిల్లాల వారీగా వాతావరణ సమాచారం Sun, Sep 25, 2022, 10:33 AM