ఏపీలో ఒక్కరోజులో 4,348 కరోనా కేసులు

by సూర్య | Fri, Jan 14, 2022, 10:51 AM

విజయవాడ :  ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకు అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 823 కేసులు గుర్తించారు. ఒక్క పశ్చిమ గోదావరి (86) జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 100కి పైనే పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 261 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,92,227 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,63,516 మంది ఆరోగ్య వంతులయ్యారు. అటు, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 14,204 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,507కి పెరిగింది.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM