సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ షాక్

by సూర్య | Fri, Jan 14, 2022, 10:49 AM

సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ షాక్...అందరికీ జీతాల్లో కోత. ఏపీలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది.ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో ఏకంగా… 10665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో జగన్‌ సర్కార్‌ కోత పెట్టింది.సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాలు మినహంచాలంటూ.. డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్దంగా వ్యవహరించి జీత భత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీత భత్యాలు కోత విధించడం ఏంటంటూ.. సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ డిక్లేర్‌, పే స్కేల్‌ అమలు చేయలేదని… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది


 


 

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM