ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే పద్మావతి
 

by Suryaa Desk |

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కొండమీద శ్రీ వెంకటరమణ స్వామికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలందరూ హాయిగా, ఆనందంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు కావల్సినవన్నీ ముఖ్యమంత్రి జగనన్న సమకూర్చుతున్నారని, ఇంటి వద్దకే రేషన్ వస్తోందని తెలిపారు. కరోనా ప్రకంపనలు వినిపిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రజలు పడిన అవస్థలను చూసిన ముఖ్యమంత్రి ముందుగా స్పందించి, రాష్ట్రంలో పలుచోట్ల ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేశారని తెలిపారు. పలు ప్రభుత్వాసుపత్రుల్లో ప్లాంట్లను సిద్ధం చేసినట్టు వివరించారు. ఆ దేవుని ఆశీస్సులు ఉండటం వల్లనే ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి మనందరకు దొరికారని పేర్కొన్నారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM