బీజేపీని వీడనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు: శరద్ పవార్

by సూర్య | Thu, Jan 13, 2022, 09:24 PM

బీజేపీని మరికొంతమంది ఎమ్మెల్యేలు వీడను ఉన్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాంబు పేల్చారు. ‘బీజేపీని ఆ పార్టీ నేతలు వీడని ఒక్క రోజు కూడా లేదు. ఉదాహరణకు యూపీని తీసుకుంటే.. 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడి మరో పార్టీలో చేరుతున్నారని.. ఈరోజే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని నాకు తెలిసింది' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి పలువురు నేతలు వరుసపెట్టి వీడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎస్పీ లో వారు చేరుతున్నారు. ఈ పరిణామాలు బిజెపిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM