పట్టాలు తప్పిన రైలు... తప్పిన పెద్ద ప్రమాదం.. కానీ తీవ్ర గాయాలు

by సూర్య | Thu, Jan 13, 2022, 09:10 PM

మరో రైలు పట్టాలు తప్పింది. కానీ వేగం తక్కువగా ఉండటంతో అతి పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు న్యూ దామోహని వద్ద పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పక్కకి పడిపోయాయి. మరో ఆరు బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్టు నిర్ధారించారు. పడిపోయిన బోగీల్లో ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. పట్టాలపై పగుళ్లు ఉన్నందునే రైలు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండడంతో ప్రమాద తీవ్రత సాధారణ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఘటన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM