ఏ మాత్రం అసౌకర్యం కలిగించం: జ్యోతిరాదిత్య సింథియా

by సూర్య | Thu, Jan 13, 2022, 05:34 PM

రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఇకపై ఎంతమాత్రం అసౌకర్యం కలగదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా హామీ ఇచ్చారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంతో పాటు, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేశారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. జీవీఎల్ లేఖపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కేంద్రం తరఫున ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఇకపై ఎంతమాత్రం అసౌకర్యం కలగదని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలావుంటే ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జీవీఎల్ కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల బొత్స సత్యనారాయణ తిరుపతి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలే ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేతకు దారితీశాయంటూ ఆ పత్రికా కథనంలో పేర్కొన్నారు.

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM