ఉత్సాహంతో ముందుకు...లాభాలతో ముగిసిన మార్కెట్

by సూర్య | Thu, Jan 13, 2022, 05:32 PM

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామలు స్టాక్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపడంలేదు. మార్కెట్ మాత్రం ఉత్సాహంగా దూసుకెళ్లోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 61,235కి చేరుకుంది. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 18,258 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈనాటి ట్రేడింగ్ లో 1,630 షేర్లు అడ్వాన్స్ కాగా.... 1,609 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 62 షేర్లు ఎలాంటి మార్పుకు గురి కాలేదు.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


టాటా స్టీల్(6.35%), సన్ ఫార్మా (3.54%), ఎల్ అండ్ టీ (2.64%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.49%).


టాప్ లూజర్స్:


ప్రో (-5.98%), ఏసియన్ పెయింట్స్ (-2.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.60%).

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM