నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతికరం:జీవీఎల్
 

by Suryaa Desk |

"తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. రేణిగుంట విమానాశ్రయానికి, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు నీటి సరఫరా నిలిపివేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. నీటి సరఫరా పైప్ లైన్లను కత్తిరించడమే కాకుండా, నీటి ట్యాంకర్లు వెళ్లకుండా రోడ్డును సైతం తవ్వేశారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇది వైసీపీ నేతల పనే అంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రోడ్లు తవ్వేయడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశాను. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరాను" అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ట్వీట్ తో పాటు సదరు పత్రికా కథనాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM