దూసుకొచ్చాడు...డ్రైవర్ అప్రమత్తంతో ప్రాణాలతో బయటపడ్డాడు

by సూర్య | Thu, Jan 13, 2022, 05:30 PM

హీరోయిజానికి వెళ్లి యువకులు ప్రాణాలను  తీసుకొనే పరిస్థితి వస్తోంది. అతివేగంగా తమ టూ విలర్, ఫోర్ విలర్స్ ను నడుపుతూ తాము ప్రాణాలు కోల్పోవడమే కాదు. ఇతరుల ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. ఇదిలావుంటే సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడం, అటుగా వచ్చే భారీ వాహనం డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రాణనష్టం జరగకుండా సాగిన ఆ వీడియో చూస్తున్నంత సేపు ఆసక్తిగా మారింది. వివరాలలోకి వెళ్లితే. హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ఓవర్ స్పీడ్. మూల మలుపులోనూ వేగం తగ్గలేదు. రయ్యున దూసుకొచ్చేశాడా యువకుడు. అదే సమయంలో ఓ బస్సు అక్కడ యూటర్న్ తీసుకొంటోంది. యువకుడు వస్తున్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ కొట్టేయడం.. ఉన్న కొద్ది గ్యాప్ లో నుంచి బైక్ దూసుకెళ్లిపోవడం కళ్లుమూసి తెరిసేంతలో జరిగిపోయాయి. చావు నుంచి ఆ యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఎలయరపాడులో జరిగింది. బస్సు యాక్సిడెంట్ ను తప్పించుకున్నా.. ముందట ఓ చెట్టు, కట్టడం మధ్య నుంచి దూసుకెళ్లిపోయాడు. అక్కడ కూడా అతడు వేగం తగ్గలేదు. హెల్మెట్ కిందపడిపోయినా వెనుదిరిగి చూడకుండా అదే వేగంతో ముందుకెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM