ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్
 

by Suryaa Desk |

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. హెచ్ఆర్ఏ వ్యవహారం పై ఇప్పటి వరకు పీటముడి వీడలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయ్యారు ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెబుతోంది జగన్ మోహన్ ప్రభుత్వం. అయితే సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏ పై క్లారిటీ ఇస్తామని చెప్పారు సీఎంఓ అధికారులు. హెచ్చార్‌ఏ పై క్లారిటీ రాకుంటే కార్యాచరణ రూపకల్పన పై సమావేశమవ్వాలని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం తమకు సమ్మతం కాదని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. అయితే దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM