ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ప్రజలు

by సూర్య | Thu, Jan 13, 2022, 05:03 PM

గత నాలుగు నెలల కింద ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాలిబన్లు రాజ్యాధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. తాలిబన్లు అమలుపరుస్తున్న నిబంధనల కారణంగా అక్కడి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మహిళలు బయటికి రావాలంటే గజగజ వణికి పోయే పరిస్థితి అక్కడ నెలకొంది. అటు ఆకలి చావులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులు ఆకలి తీర్చడానికి అవయవాలను అమ్ముకుంటున్న సంఘటనలు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హెరాత్ ప్రావిన్స్ లో కిడ్నీల విక్రయం ఎక్కువగా సాగుతోంది. ఆపరేషన్ జరిగిన తర్వాత రెస్ట్ లేకుండా రెండు మూడు నెలలకే పనుల్లోకి వెళుతున్నారు. వారి కిడ్నీలను అమ్మి కుటుంబసభ్యుల ఆకలిని తీరుస్తున్నాయి. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. తాలిబన్ల అరాచక పాలన కారణంగా తమకు ఇలాంటి ఇ భాగ్య పరిస్థితి ఎదురైంది అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM