సెల్‌ఫోన్లు చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.. 52 సెల్ ఫోన్లు స్వాధీనం

by సూర్య | Thu, Jan 13, 2022, 04:46 PM

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్లైన్ లో విక్రయించే సెల్‌ఫోన్ల మాయం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 52 సెల్‌ఫోన్లను సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ఎం. దీపిక బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్న విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ముత్యాల సురేంద్ర తమ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన ఫోన్లు డెలివరీ కాకుండా మాయమౌతున్నట్టు రెండో పట్టణ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును చేధించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులే ఫోన్లు వినియోగదారులకు చేరకుండా మాయం చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు పుచ్చలవీధికి చెందిన నాళం గణేష్‌, బుంగవీధికి చెందిన రేయి గణేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM