ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్

by సూర్య | Thu, Jan 13, 2022, 03:08 PM

ఆ గ్రామంలో మహిళలకు నెలసరి సమయంలో ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్ అందించడంతో ఆ గ్రామం శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా పేరుగాంచింది. నెలసరి సమయాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్స్ వాడడం సహజం. అయితే కేరళలోని ఓ గ్రామం దేశంలోన ‘తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామం’గా రికార్డులకెక్కనుంది. ఎర్నాకుళంలోని కుంబలంగిలో ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్ ను అందించనున్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఇవాళ 5 వేల మెన్ స్ట్రువల్ కప్పులను పంపిణీ చేయనున్నారు. ‘అవల్కాయ్ (ఆమె కోసం)’ అనే పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఎంపీ హీబి ఈడెన్ చెప్పారు. థింగాల్ స్కీమ్ కింద హెచ్ఎల్ఎల్ మేనేజ్ మెంట్ అకాడమీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయన్నారు. కప్పుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుంబలంగిని మోడల్ విలేజ్ గా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఈ మోడల్ గ్రామ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.  

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM