ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

by సూర్య | Thu, Jan 13, 2022, 02:56 PM

చిత్తూరు: సత్యవేడు ఆర్టిసి డిపోకు చెందిన బస్సు కంటైనర్ను ఢీ కొనడంతో బస్సు డ్రైవర్ బాబు(49) మృతి చెందారు. మరో డ్రైవర్ మహేశ్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద సంఘటన గురువారం తెల్లవారుజామున జడ్చర్ల వద్ద సంభవించింది. వివరాల్లోకెళితే.. సత్యవేడు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సత్యవేడు నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్ళింది. డ్రైవర్ గా బాబు, మహేశ్వర్ ఇద్దరూ డ్యూటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్గమధ్యంలో జడ్చర్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ముందు వెళ్తున్న కంటైనర్ను అధిగమించేటప్పుడు బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొట్టింది.


దీంతో బస్సు నడుపుతున్న బాబు అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ మహేశ్వర్ తలకు తీవ్రగాయాలు అయినట్టు స్థానిక ఆర్టీసీ కార్మికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ మహేశ్వర్ ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ ను ఢీ కొనడంతో ఆర్టిసి బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ బాబు స్వగ్రామం పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామం. దీనిపై అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమాచారాన్ని సత్యవేడు ఆర్టిసి డిపో మేనేజర్ గంగాధర్ రావుకు అందించారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM