మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్

by సూర్య | Thu, Jan 13, 2022, 02:51 PM

చిత్తూరు: అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం అయిన పేద మహిళకు ఆక్సిజన్ కాన్సెట్రేటరును పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెలితే. గుడుపల్లి మండలం కోడిగానీపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఈ సమయంలో ఆక్సిజన్ అవసరం పడింది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు సహాయం చేయాలని సోనూసూద్ ఫౌండేషన్ ని ఆశ్రయించారు. గుడుపల్లి మండలానికి చెందిన సోనూసూద్ ఫాండేషన్ సభ్యుడు పురుషోత్తం చొరవ తీసుకుని విషయాన్ని సోనూసూద్ ఫౌండేషన్ తెలియచేశాడు. వెంటనే స్పందించిన సోనూసూద్ ఫౌండేషన్ వెంటనే ఆక్సిజన్ కాన్సెట్రేటరు సమకూర్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తమ విషయం తెలిసి సహాయం అందించిన సోనూసూద్ కి వారి ఫౌండేషన్ సభ్యులకు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు ఋణపడి ఉంటామని తెలిపారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM