టీమిండియా వరల్డ్ కప్ జట్టులో తెలుగమ్మాయి

by సూర్య | Thu, Jan 13, 2022, 02:46 PM

తెలుగు మహిళా క్రికెట్‌ అంటే అందరికీ మిథాలీరాజ్‌ మాత్రమే గుర్తొస్తుంది. అయితే మరో తెలుగుతేజం ఇప్పుడు మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైంది. ఆమె పేరే సబ్బినేని మేఘన.


శ్రీనివాస రావు, మాధవి దంపతుల కూతురైన మేఘనది విజయవాడలోని ఇబ్రహీంపట్నం. ఆమె తండ్రి శ్రీనివాసరావు టీఎస్‌ జెన్‌కోలో రీజనల్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారు. మేఘనకు చిన్నప్పుడే ఆటలంటే ఆసక్తి కలిగింది. ఆమె తండ్రికి క్రికెట్‌ పట్ల ఉన్న ఆసక్తి, సచిన్‌ పై ఉన్న అభిమానం చూశాకే తనకు క్రికెట్ పై ఆసక్తి పెరిగిందని మేఘన చెప్పారు.


ఏడో తరగతిలో ఉండగానే క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన మేఘన.. ఏడాదికే రాష్ట్ర స్థాయిలో ఆడటం మొదలుపెట్టారు. స్కూలుకి సరిగా హాజరవ్వలేక చివరి పరీక్షలు మాత్రమే రాసేది. ఆమెకు తన సోదరి. నాన్న చదువులో సాయం చేసేవారని మేఘన తెలిపారు. తాను బీఎస్‌సీ మేథ్స్‌ చేశానని, దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లు మేఘన చెప్పుకొచ్చారు.


తాను నాలుగేళ్ల నుంచి రైల్వేస్‌కు ఆడుతున్నానని మేఘన తెలిపారు. 2016లోనే ఆసియా కప్‌ ఛాంపియన్స్‌ టీమ్‌లో ఉన్నానని, రెండు మ్యాచ్‌ లు ఆడినట్లు మేఘన తెలిపారు. రెండేళ్లుగా బాగా ఆడడంతో ప్రపంచ కప్‌ జట్టులో అవకాశం వచ్చిందని మేఘన తెలిపారు. రోజూ కనీసం 5 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్లు మేఘన తెలిపారు. తాను ఈ స్థాయికి రావడానికి తన గురువులే కారణమని మేఘన తెలిపారు. తన మొదటి కోచ్‌ నుంచి రైల్వే కోచ్‌ వరకు అందరూ తనను మలుస్తూ వచ్చారని మేఘన చెబుతున్నారు. మిథాలీరాజ్‌ సలహాలు, సూచనలు కూడా ఇచ్చేదని చెప్పారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM